Neeve Naa Aadharamu Song Lyrics Telugu | నీవే నా ఆధారము-నీవే నా ఆనందమూ Song Lyrics

Christians Lyrics

నీవే నా ఆధారము-నీవే నా ఆనందమూ


 నీవే నా ఆధారమూ - నీవే నా ఆనందమూ.

పల్లవి:- ఏ క్షణమైనా నా జీవితానా, ఏ క్షణమైనా నా జీవితాన... 

అను పల్లవి:- నీవే నా ఆధారమూ... నీవే నా ఆనందమూ. 

నీవే నా ఆధారమూ యేసయ్యా - నీవే నా ఆనందమూ... 

వర్ణింప నా తరమా? నీ ప్రేమా...! - వివరింపగ సాధ్యమా? నీ కరుణ! వివరింపగా సాధ్యమా...!

చరణం.1. ఓ తల్లి బిడ్డను మరచునటా గానీ! - నీవు నన్నెప్పుడు మరువవటా!...||2||

నా అరచేతిలో చెక్కితి చూడనీ||2|| 

దక్షిణ హస్తము చాపే కదా! 

తన దక్షిణ హస్తము చూపే కదా!

ఏ క్షణమైనా నా జీవితాన... ఏ క్షణమైనా నా జీవితాన, 

నీవే నా ఆధారమూ - నీవే నా ఆనందమూ. నీవే నా ఆధారమూ యేసయ్యా నీవే నా ఆనందమూ...

చరణం.2. ఓ మనిషి మాటిచ్చి మరచునటా గానీ, నీ మాటలెన్నడు మారవటా! ||2||

సర్వము మాటతో పలికి సృజించిన||2|| సర్వజ్ఞుడవూ నీవే కదా!||2||

ఏ క్షణమైనా నా జీవితాన


||2|| 

నీవే నా ఆధారమూ - నీవే నా ఆనందమూ. 

నీవే నా ఆధారమూ యేసయ్యా - నీవే నా ఆనందమూ...

చరణం.3. మంటికి మారే మనిషినటా గానీ! మహిమ పాత్రగా మలిచెనటా!||2||

మార్గములన్నిటా అడుగులు జారక||2|| దూతల కాపలా పంపే కదా! దేవ, దూతల కాపలా పంపు కదా!

ఏ క్షణమైనా నా జీవితాన


||2||

నీవే నా ఆధారమూ - నీవే నా ఆనందమూ. 

నీవే నా ఆధారమూ యేసయ్యా - నీవే నా ఆనందమూ...

చరణం.4. కన్నీరు లేని రాజ్యమటా! అది కళ్యాణ శాశ్వత శోభనటా! ||2|| 

అర్హత లేని అన్య జనాంగమును! అర్హత అల్పులందరినీ! ఆ మహిమ రాజ్యము చేర్చు కదా ! ఆ మహిమ రాజ్యము చేర్చే కదా! 

ఏ క్షణమైనా నా జీవితాన


||2|| 

నీవే నా ఆధారమూ - నీవే నా ఆనందమూ. 

నీవే నా ఆధారమూ యేసయ్యా - నీవే నా ఆనందమూ...

వర్ణింప నా తరమా? నీ ప్రేమా! - వివరింపగా సాధ్యమా? నీ కరుణా! వివరింపగా సాధ్యమా!.

To Top