Yevaru Song Lyrics Telugu - Gowthami Blessy

Christians Lyrics

Yevaru Song Lyrics Telugu


 పల్లవి :- 

సిలువలో ఆ కలువరిలో బలియాగమయింది ఎవరు..? #2#

 నీ పాపము నీ దోషము కడిగింది ఎవరు..?

 నీ బాధలు నిట్టూర్పులు మోసింది ఎవరు..? #2#

 క్రీస్తు కాదా....? 

 ఓ నేస్తమా  తెలియలేదా..? 

 నీకు గురుతు రాదా...?


@ సిలువలో ఆ కలువరిలో @


 చరణం :- 

 నీకై నలిగినది..

 నీకై ఒరిగినది..

 నీ నా పాపముకై ప్రాణమే పెట్టినది...

 ఎవరు..? ఎవరు..? ఎవరు..?

 క్రీస్తు కాదా....? 

 ఓ నేస్తమా  తెలియలేదా..? 

 నీకు గురుతు రాదా...?


@ సిలువలో ఆ కలువరిలో @


 చరణం :- 

 నిన్నే ప్రేమించినది..

 నిన్నే పోషించినది..

 పుట్టినది మొదలుకొని ముదిమి వరకు మోయునది ...#2#

 ఎవరు..? ఎవరు..? ఎవరు..?

 క్రీస్తు కాదా....? 

 ఓ నేస్తమా  తెలియలేదా..? 

 నీకు గురుతు రాదా...?


@ సిలువలో ఆ కలువరిలో @

To Top