Oohaku Andani Karyamul Song Lyrics Telugu | ఊహకు అందని కార్యముల్ Song Lyrics

Christians Lyrics

ఊహకు అందని కార్యముల్ Song Lyrics


 ఊహకు అందని కార్యముల్

ఊహించని రీతిలో నాకై చేసిన దేవా

ఊహకు అందని వేళలో

ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా

ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్

నీదు నామ గీతము నాదు జీవితాంతము

కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ||ఊహకు||


కనబడవు మా కళ్ళకు – మరి వినబడవు మా చెవులకు

ఊహలకే అస్సలందవు – ప్రభు నీ కార్యముల్ (2)


అడుగువాటి కంటెను – ఊహించు వాటి కంటెను

అద్భుతాలు చేయగా – వేరెవరికింత సాధ్యము

అసాధ్యమైనదేది నీకు లేనే లేదు

ఇల నీకు మించి నాకు దైవమెవరున్నారు (2) ||ఉత్సహించి||


బండ నుండి నీళ్లను – ఉబికింపజేసినావుగా

ఎడారిలో జల ధారలు – ప్రవహింపజేసినావుగా

కనుపాప లాగ నన్ను కాచే దైవం నీవు

నడి సంద్రమైన నన్ను నడిపే తోడే నీవు (2) ||ఉత్సహించి||


To Top