ARADHINCHEDAM SONG LYRICS TELUGU

Christians Lyrics

ARADHINCHEDAM SONG LYRICS TELUGU

 

ఆరాధించెదం  ఆర్భాటించెదం - యేసుని సన్నిధిలో 

ఆనందించెదం మరల ఆనందించెదం - దేవుని సన్నిధిలో 

సాయంకాల నైవేద్యము వలే చేతులెత్తి స్తుతియించెదం

జిహ్వా ఫలము  ప్రభుకర్పించి ‌‌‌‌‌‌‌‍‌‌‍‌- స్తుతిగీతము పాడెదము 

"యేసయ్యా యేసయ్యా పరిశుద్దుడవు నీవేనయ్యా 

యేసయ్యా యేసయ్యా స్తుతులకు అర్హుడ నీవేనయ్యా"


1.  యెరికో కోట గోడలన్ని – కూలిపోయే కాలిపోయే 

         ఇశ్రాయేలు ప్రజలంతా కుడి ఆరాధించగా ఆర్భాటించగా 

         స్తుతులపై ఆసీనుడ యేసయ్యా 

         మా ప్రార్థనలు ఆలకించువాడా 

         స్తుతి యాగము చేయు వాడే – నిన్ను మహిమపరచువాడు “యేసయ్యా”


2. యూదాదేశము మీదికి – శత్రు సైన్యము దండెత్తగా 

        యెహోషాపాతు తన ప్రజలతో స్తుతియించగా స్తోత్రము చేయగా 

        దేవుడే యుద్ధము జరిపెను – ఆద్భుత జయమును పొందిరి 

        బెరెకా లోయలో కూడిరి 

        కృతజ్ఞతా స్తుతులు చెల్లించిరి 

 “యేసయ్యా”

  


        దేవుని కె స్తుతి మహిమలు కలుగును గాక .....

To Top