Na Gunde Mandaga Song Lyrics | నా గుండె మండగా పాట సాహిత్యం - A Song For Manipur

Christians Lyrics

నా గుండె మండగా పాట సాహిత్యం - A Song For Manipur 


 పల్లవి :- 

నా గుండె మండగా - రాస్తున్నా గీతిక...

 అందుడవై  వుండక-  మారాలి నీవిక...

 కారిన కన్నీళ్లు -రాలిన ప్రాణాలు 

 పోయిన మానాలు సాక్షిగా...


 భీకర రోదనలు - భయంకర హింసలు 

 సజీవ దహనాలకు బదులుగా..


 ఓ భారతీయుడా నా సహోదరుడా

 మారాలి నీవిక కదలాలి ఆపగా


 చరణం :-


అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా

 నడిస్తేనే స్వాతంత్రం అన్నావు ఆనాడు నీవు...

 ఈనాడు aa భరతమాత కన్నతల్లి బిడ్డను పట్టపగలే దిగంబరిగా వీధికీడ్చినావు...


 మనసు లేదా నీలాంటి మనుషులు వారు కాదా...? 

 మనిషివేగా నిన్ను కన్నది భరతమాత కాదా..?


ఓ భారతీయుడా నా సహోదరుడా

 మారాలి నీవిక కదలాలి ఆపగా


 నా గుండె మండగా - రాస్తున్నా గీతిక...

To Top